బ్రేకింగ్ న్యూస్
రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిరాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి
తెలంగాణ

అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారం

అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారం

పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి.. రూ.2 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం

ఆత్మకూర్ పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-

మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా...?
మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?

ఆత్మకూర్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ఆత్మకూర్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ జి. నాగమణి, వైస్ చైర్‌పర్సన్ నల్గొండ శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి బంగారు భాస్కర్ షాపు వరకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రహదారుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడం ద్వారా వ్యాపార కార్యకలాపాలకు కూడా మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడమే మున్సిపల్ పాలకవర్గం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.