మన ప్రగతి న్యూస్ / ఇనుగుర్తి:
చిన్నారుల ఎదుగుదలలో తొలి ముద్ద అన్నం తినిపించే అన్నప్రాసన వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తేజావత్ అనూష–గణేష్ దంపతుల కుమారుడు ధనుంజయ్ అన్నప్రాసన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ధనుంజయ్‌కు తొలి అన్నం తినిపించే కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుకన్య, ఆయమ్మ భూక్యా రోజా, దాసరి స్పందన, నందిని, అశ్విని, పించమ్మ, మాజీ ఉపసర్పంచ్ బాణాల వెంకన్న, చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

