మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో రూ.20 లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నామని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీరామానంద్ తెలిపారు..
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు..ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా, అభివృద్ధి పనులే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి, కౌన్సిలర్లు పున్నం నరసింహారెడ్డి, పొన్నాల మనిషా ప్రకాష్, మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ములుకల మనీష్, తదితరులు పాల్గొన్నారు


