ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సంఘం కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు,గురిజాల శ్రీధర్ పిలుపు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, నవంబర్ 18: పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు, వ్యవసాయ కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి ఏడాదికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజువారీ వేతనం రూ.800 చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా సంఘం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం నవంబర్ 25న వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలో నిరుద్యోగ యువత, మహిళలు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ సంఘం కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గురిజాల శ్రీధర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన నాంపల్లి గ్రామంలో ప్రజలను కలిసి ధర్నా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాంపల్లికి చెందిన వడ్డెర చిలకమ్మ, శివరాత్రి చిన్న లక్ష్మి, శివరాత్రి పాపవ్వ, దండుగుల లత, శివరాత్రి సంధ్య, దండుగుల శిరీష తదితరులు పాల్గొన్నారు.

