బ్రేకింగ్ న్యూస్
రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజురాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజు
రాజన్న సిరిసిల్ల

రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?

రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?

గర్భగుడి శిఖరాన్ని తొలగించడంపై బీజేపీ ఆగ్రహం

మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆలయంలోకి అనుమతివ్వాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

రాజన్న సిరిసిల్ల జిల్లా :వేములవాడ రాజన్న ఆలయం ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ఆలయ అభివృద్ధి పేరుతో ప్రాచీన నిర్మాణాలు, ఆగమ సంప్రదాయాలకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోపి మాట్లాడుతూ.. గతంలో గర్భగుడిని ముట్టుకోబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు శిఖరాన్ని తొలగించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. స్లాబ్ నిర్మాణం వల్ల గోపుర శిఖరం కనిపించకుండా పోవడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.శృంగేరి పీఠం అనుమతుల పేరుతో ఏ పనులు చేపడుతున్నారో స్పష్టం చేయాలని, అనుమతి పత్రాలను బహిర్గతం చేయాలని కోరారు. ఆలయానికి కేటాయించిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు. మీడియా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆలయంలోకి ప్రవేశం కల్పించి అభివృద్ధి పనులను పరిశీలించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆలయ పరిరక్షణ కోసం ప్రశ్నించిన బీజేపీ నాయకులను అరెస్టు చేయడం సరికాదని, అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఆలయ ప్రాచీన వైభవాన్ని కాపాడే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సిరికొండ శ్రీనివాస్, పొన్నాల తిరుపతిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రెగుల సంతోష్ బాబు, కౌన్సిలర్లు వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…