బ్రేకింగ్ న్యూస్
ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ

భక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థ

భక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థ

పవిత్ర కురుమూర్తి జాతరలో మద్యం మాఫియా స్వైరవిహారం..

కలెక్టర్, ఎస్పీ ఆదేశాలకే తూట్లు!

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-

ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహన
ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహన

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరకు భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, జాతర పరిసరాల్లో అక్రమ మద్యం విక్రయాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మాంసం విక్రయ కేంద్రాల వద్దే మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయని, జాతరకు వచ్చే భక్తులు, కుటుంబాలతో పాటు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతర పరిసరాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ, కూతవేటు దూరంలో ఉన్న అబ్కారీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు మద్యం అక్రమ వ్యాపారానికి కొందరు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మద్యం వ్యాపారుల నుంచి మామూళ్లు అందుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.పవిత్రమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో జాతర ప్రాంగణంలో మద్యం విక్రయాలు, బహిరంగ మద్యం సేవనాన్ని తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా దృష్టిసారించి అక్రమ మద్యం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటారా? అబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపిస్తారా? లేక మద్యం దందా యథేచ్ఛగా కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.