బ్రేకింగ్ న్యూస్
రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిరాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి
రాజన్న సిరిసిల్ల

బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..

బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..

👉ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు అందరికీ చేరవేయాలి

👉జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా బీమా దరఖాస్తులో వివరాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి… కుటుంబాల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచ, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 23 వ వార్డు లో ఏర్పాటు చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!
రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!

ఆయా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయగా, పరిశీలించారు. రిజిస్టర్లు ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేయగా, పరిశీలించి.. ఎందరు నమోదు చేసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్లో బీమా వివరాలు నమోదు చేస్తుండగా, పరిశీలించి.. మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో ఆరా తీశారు. సిరిసిల్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అన్ని కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు ఉన్నాయని వివరించారు. బీమా వివరాల నమోదు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. అర్జీదారులు రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రత్యేక కేంద్రాల్లో బీమా వివరాలు, నామినీ వివరాలు పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, నోడల్ అధికారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిరిసిల్ల 23వ వార్డు సభ్యురాలు ఆడెపు చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్లు జయంత్, మహేష్ తదితరులు ఉన్నారు.