బ్రేకింగ్ న్యూస్
కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలుకస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
తెలంగాణ

కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?

కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?

ఆసుపత్రికి దారిలేని అభివృద్ధి పనులు.. ఎవరికి ఉపయోగం?

రోగులు, అంబులెన్సులు రాకపోకలకు తప్పని ఇబ్బందులు

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-

కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఆత్మకూర్ అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు కనీస ప్రణాళిక, ముందుచూపు ఉండాలి. కానీ వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట చేపట్టిన నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యమా.. కాంట్రాక్టర్ అలసత్వమా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి ఎదుట కొత్తగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టినప్పటికీ, ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద మాత్రం కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు, గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు వైద్య సేవల కోసం వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు సైతం ఆసుపత్రిలోకి చేరాల్సి ఉంటుంది. అలాంటి కీలకమైన ప్రవేశ ద్వారం వద్ద కల్వర్టు ఏర్పాటు చేయకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేసే సమయంలో ఆసుపత్రి ప్రవేశ మార్గాన్ని పట్టించుకోకపోవడం పనుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనుల్లో ఇలాంటి లోపాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి? పనులు ప్రారంభించే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదా? కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా పనులు చేపట్టారా? లేక సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారా? అన్న ప్రశ్నలు పట్టణ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.ఆసుపత్రి వంటి అత్యవసర వైద్య సేవలు అందించే ప్రదేశంలోనే ఇలాంటి నిర్లక్ష్యం ఉంటే ఇక మిగతా అభివృద్ధి పనుల పరిస్థితి ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన డ్రైనేజీ ప్రయోజనం కంటే ప్రజలకు ఇబ్బందులే ఎక్కువగా మిగిలే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.