మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పెద్ద కుమార్తె డాక్టర్ గాయత్రి వివాహ మహోత్సవం డిసెంబర్ 3న వైరాలో నిర్వహించనున్న నేపథ్యంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వాన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.వివాహ వేడుకకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్కే నాయుడుకు సైతం వివాహ ఆహ్వాన శుభలేఖను అందజేసి వేడుకకు ఆహ్వానించారు. మండలవ్యాప్తంగా ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని వివాహ వేడుకను విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లడి నరసింహారావు, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లచ్చు నాయక్, మండల నాయకులు గూగులోత్ బాలాజీ, అప్పారావు, చలమల నరసింహారావు తదితరులు పాల్గొంటున్నారు.

