బ్రేకింగ్ న్యూస్
వైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతవైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేత
రాజన్న సిరిసిల్ల

నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

👉 విత్తనాల విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు.

👉తరచూ నకిలీ విత్తనాల కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్ట్ అమలు.

👉జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

జిల్లాలో నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, తరచూ ఇటువంటి కేసుల్లో పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

శనివారం రోజున పోలీస్ , వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, ఎరువులు, విత్తనాల నిల్వలు, బిల్లులు, రసీదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!
రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!

జిల్లాలో ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని, జిల్లాలోని ఫర్టిలైజర్, సీడ్స్ షాపులపై నిరంతరం నిఘా ఉంచి నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తున్నన్నారు.

ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, నాణ్యతపై అనుమానం ఉన్నా లేదా ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ప్రజలకు, రైతులకు సూచించారు.

రైతులను నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల బారి నుంచి రక్షించేందుకు జిల్లా పోలీస్, వ్యవసాయ శాఖ సమన్వయంతో నిరంతరం తనిఖీలు కొనసాగిస్తాయని తెలిపారు.

ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.