బ్రేకింగ్ న్యూస్
బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
హైదరాబాద్

‘పొలిమేర 3’లో అర్జున్ సర్జా.. ‘విరావి’ పాత్ర ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

‘పొలిమేర 3’లో అర్జున్ సర్జా.. ‘విరావి’ పాత్ర ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పొలిమేర’ నుంచి వస్తున్న మూడో చిత్రం ‘పొలిమేర 3’లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘విరావి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను చిత్రబృందం దీపావళి సందర్భంగా విడుదల చేసింది. ఇందులో అర్జున్ సర్జా యోధుడి వేషధారణలో, చేతిలో కత్తితో గంభీరమైన రూపంలో కనిపించారు.

డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్)కు చెందిన భరత్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆలయంలోని చీకటి ప్రదేశాలు, అమావాస్య వాతావరణం, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అనంత పద్మనాభస్వామి దర్శనం అనంతరం కథలోని మిస్టరీ అంశాలను పరిచయం చేశారు. కొమరయ్య పాత్రలో సత్యం రాజేశ్ క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యాల తర్వాత అర్జున్ సర్జా పోషిస్తున్న విరావి పాత్రను చూపించారు.

ఈ చిత్రంలో సత్యం రాజేశ్ మరోసారి కొమరయ్యగా నటిస్తుండగా, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్లింప్స్‌లో నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అర్జున్ సర్జా పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

‘మా ఊరి పొలిమేర’ ఓటీటీలో విడుదలై ప్రేక్షకాదరణ పొందగా, ఆ తర్వాత వచ్చిన ‘పొలిమేర 2’ థియేటర్లలో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మూడో భాగంలో అర్జున్ సర్జా చేరడం, నాలుగు దక్షిణాది భాషల్లో విడుదలకు సన్నాహాలు చేయడం చిత్రంపై అంచనాలను పెంచుతోంది. సినిమా విడుదల తేదీని చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.