బ్రేకింగ్ న్యూస్
ఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాకురుమూర్తి స్వామి ఆభరణాల శోభయాత్రకు సర్వం సిద్ధం…ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంరంగయ్య చెరువు కుడి కాలువ పనులు ప్రారంభంబూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాకురుమూర్తి స్వామి ఆభరణాల శోభయాత్రకు సర్వం సిద్ధం…ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంరంగయ్య చెరువు కుడి కాలువ పనులు ప్రారంభంబూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన
తెలంగాణ

బిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

బిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం.. సాగునీటి పనులు ప్రారంభం.

ఆందోళనల హెచ్చరికతో కదిలిన అధికార యంత్రాంగం.

మెగా కంపెనీ, కాంట్రాక్టర్లతో పెండింగ్ పనులకు మోక్షం.

రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తాం.

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి.

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

ఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా
ఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం, ఆందోళనల హెచ్చరికతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చిందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న కాలువలు, పైప్‌లైన్ల నిర్మాణ పనులను ఎట్టకేలకు అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైతుల సాగునీటి కష్టాలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు గుర్తించి పనులు చేపట్టడం స్వాగతించదగిన పరిణామమన్నారు.

*ఏళ్ల తరబడి సాగిన జాప్యం.. రైతులకు తీరని నష్టం*

2009లో టెండర్లు దక్కించుకుని ఒప్పందం కుదుర్చుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పటివరకు పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సారంగపాణి ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు, పైప్‌లైన్ల నిర్మాణాల్లో జాప్యం కారణంగా సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అన్నదాతల సమస్యలపై పలుమార్లు ప్రశ్నించినా సంబంధిత అధికారులు, కాంట్రాక్టు సంస్థలు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.సాగునీటి పనులను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు స్పందించి పెండింగ్ పనులను ప్రారంభించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షం పోషించే పాత్రకు ఈ పరిణామం నిదర్శనమని పేర్కొన్నారు.పనులు పూర్తయ్యే వరకు పోరాటం ఆగదు. ఈ సందర్భంగా పీఏసీఎస్ మాజీ చైర్మన్ చెట్టుపల్లిమురళీధర్మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్యవేక్షించాలని, పనుల పూర్తికి నిర్దిష్ట గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేవలం పనులు ప్రారంభించడంతో సరిపెట్టకుండా నిర్ణీత సమయంలో నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని, మళ్లీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే రైతులు, ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.