బ్రేకింగ్ న్యూస్
బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీచేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీచేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.
తెలంగాణ

రాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన

రాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన

దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌

మద్దతు ధర, బోనస్‌పై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి

మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా సైదాపూర్

బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది

: మండలంలోని రాయికల్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్‌ నాయకులు, రైతులు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డీఎం రజినీకాంత్‌, డీఎస్‌వో నర్సింగరావు, డీటీ విజయ్‌ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం నిల్వలు, కొనుగోళ్ల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు దళారుల కొనుగోళ్లు, అధిక తూకాలు, నగదు కోతలపై ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,461 ఉండగా, దళారులు రూ.2,300కే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి లక్ష రూపాయలపై రూ.1,500 నగదు కోతతో పాటు రూ.300 మెయింటెనెన్స్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. పాత కాంటాలతో అధిక తూకాలు వేస్తున్నారని తెలిపారు.
రాయికల్‌తో పాటు సైదాపూర్‌ మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలకు మిల్లులు కేటాయించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. సన్నధాన్యానికి రూ.500 బోనస్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని బీఆర్ఎస్‌ నాయకులు తెలిపారు.