రంగయ్య చెరువు కుడి కాలువ పనులు ప్రారంభం.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం.
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
మండలంలోని రంగయ్య చెరువు కుడి కాలువ నిర్మాణం కొరకు రుద్రగూడెం పెద్దతండ వద్ద రోడ్డు కటింగ్ పనులను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాలతో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనులను ప్రారంభించినారు. ఈ కాలువ నిర్మాణం వల్ల రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కాల్వ నిర్మాణం పనులను ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన నాయకులు మాలోత్ రమేష్, జిల్లా కార్యదర్శి జిల్లా మునేందర్, కొండాయలు పల్లి సర్పంచ ఎరుకల స్వప్న నరేష్, రంగాపురం సర్పంచ ఓరుగంటి రాజు, నల్లబెల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్, శనిగరం మాజీ సర్పంచ్ డేగల కృష్ణ, మండల నాయకులు వైనాలఅశోక్, ఇస్తారు శేఖర్, నల్లబెల్లి గ్రామ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు కన్నబోయిన సురేష్,నల్లబెల్లి గ్రామ పార్టీ యూత్ కార్యదర్శి కోడూరు సిద్దు, నల్లబెల్లి కాంగ్రెస్ కార్యకర్త యువ నాయకులు బత్తిని హరీష్, మరియు వివిధ గ్రామాల రైతులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

