మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ మైస పాపారావు,సునీత దంపతుల కుమార్తె యమునా దేవి వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన బిజ్జి లక్ష్మణ్,రేణుక దంపతుల కుమారుడు సాయితో యమునా దేవి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు బీఆర్ఎస్ మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

