బ్రేకింగ్ న్యూస్
ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ
రాజన్న సిరిసిల్ల

రాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానం

రాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానం

రాజన్నసిరిసిల్లజిల్లా,నవంబర్15:వేములవాడకు చెందిన సీనియర్ పత్రికేయులు, రాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌ను జిల్లా కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. వేములవాడలోని నృత్య కళానికేతన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాతపస్వి రాష్ట్ర కళాకారుల సంఘం కన్వీనర్ ఎల్లా పోశెట్టి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. సయ్యద్ రసూల్‌కు రాష్ట్రస్థాయి ఉర్దూ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. కళాకారులు, కళా సంస్థల కార్యక్రమాలకు పత్రికా రంగం అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.సభకు రాష్ట్ర బంగారు నంది అవార్డు గ్రహీత, సినీ నటుడు వారాల దేవయ్య అధ్యక్షత వహిస్తూ.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పత్రికా రంగంలో కొనసాగుతున్న జర్నలిస్టులు కళాకారులకు, సేవా సంస్థలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. రసూల్ వంటి పాత్రికేయుల కలం తమకు బలమని, ఆయనకు చేస్తున్న సన్మానం యావత్ పత్రికా రంగానికి గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు మాట్లాడుతూ.. నాటక రంగానికి రసూల్ అందిస్తున్న ప్రచారం, సహకారం మరువలేనివని కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత సయ్యద్ రసూల్ మాట్లాడుతూ కళాకారుల సంఘం తనపై చూపిన అభిమానానికి, ఘన సన్మానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యక్షుడు కనపర్తి హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ, రవిరాజా, దాసరి యాదగిరి, అయితం శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్
బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్