సర్పంచి పుట్ల చంద్రశేఖర్ చేతుల మీదుగా
మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:
లింగంపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన ఏడు మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం. మౌలాన్ ఖేడ్ గ్రామ ప్రజలు నాపైఉంచిననమ్మకాన్నినిలబెట్టుకుంటాను. గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అన్ని విధాలా సహకారం అందిస్తాను. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మౌలాన్ ఖేడ్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటాను అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తహరి బేగం ఎం పి ఓ రహీం సార్ విలేజ్ సెక్రెటరీ వెంకట్ లక్ష్మి గ్రామస్తులు రేణుక సుశీల ఎల్లవ్వ సుగుణవ కిషన్ సాయవ్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.

