నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి మండలంలో 600 మందికి పింఛన్లు మంజూరు
మన ప్రగతిన్యూస్-నల్లబెల్లి:
నల్లబెల్లి మండలంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. మండలవ్యాప్తంగా మొత్తం 600 మందికి చేయూత పింఛన్లు మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

