సంక్రాంతి తర్వాత అధికార పార్టీలో కీలక పరిణామాలు?.. సీనియర్ల మధ్య రహస్య మంతనాలు!
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ఆత్మకూరు రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? అధికార పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేవనుందా? అనే చర్చలు స్థానిక రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే అధికార పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు భవిష్యత్ రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, స్థానిక నాయకత్వం, రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మంతనాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.పార్టీలో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత పరిణామాలు, నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు, రాజకీయ ప్రాధాన్యతల నేపథ్యంలో సీనియర్లు ఒకే వేదికపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. సంక్రాంతి తర్వాత జరిగే పరిణామాలు ఆత్మకూరు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ మంతనాల వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఎవరికి రాజకీయంగా లాభం చేకూరనుంది? ఎవరి ప్రాధాన్యత పెరగనుంది? అన్న ప్రశ్నలు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతానికి ఇవన్నీ రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చలుగానే ఉన్నప్పటికీ, సంక్రాంతి తర్వాత చోటుచేసుకునే పరిణామాలపై పట్టణంతో పాటు మండల ప్రజలు, రాజకీయ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

