బ్రేకింగ్ న్యూస్
లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులులక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు
తెలంగాణ

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్

ఆత్మకూర్ సివిల్ ఆసుపత్రిలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు!

వైద్య సేవలపై ఆరా.. సిబ్బంది పనితీరును పరిశీలించిన భాస్కర్ నాయక్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-

లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలు
లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలు

వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) భాస్కర్ నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న ఆయన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, మందుల లభ్యత, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై పేద, మధ్యతరగతి ప్రజలు ఆధారపడుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలతో ఆసుపత్రి సిబ్బందిలో అప్రమత్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.