దేశం బాగుండాలి, ప్రకృతి ని రక్షించాలి, వసుదైవ కుటుంబం లా ఉండాలని
జీయర్ స్వామి వారి పిలుపు……..
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా నవంబర్ 10, 2026 ముంచింతల్ లో సాయంత్రం 5 గంటలకి సాక్షాత్తు సమతామూర్తి శ్రీ రామానుజులు, దివ్యదేశ మూర్తులు, మరియు బారతజాతీయ త్రివర్ణ పతాక మధ్య శ్రీరామ దివ్య సాకేతంలో నిర్వహించిన విశ్వశాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్ర నామపారాయణం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యేక్ష పర్యవేక్షణలో ఘనంగా జరిగింది, ఇట్టి కార్యంలో పిటాధిపతులు దేవనాధ జీయర్, అహోబిల, వెంకట, జీయర్ స్వాములు, వేద పండితులు, వేద అభ్యసన చేసే విద్యార్థులు, వికాస తరంగిణి కార్యకర్తలు మహిళలు రాష్ట్ర నలుమూల ల పెద్దలు ప్రభుత్వ ప్రతినిధులు కలెక్టర్ స్థాయి వారు ముఖ్యలు, విశిష్ట కైంకర్య దాతలు జిల్లాల నుండి భక్తులు వరంగల్ జిల్లా అధ్యక్షులు బీ. రాధాకృష్ణ వారి బృందం, నర్సంపేట శాఖ నుండి రంగనాధస్వామి, నీరజ, సుదర్శన్, రాజశేఖర్, మహిళలు సభ్యులు సుమారు లక్ష మంది పైన పాల్గొన్నారు, పారాయణము జరుగుతున్న సందర్బంగా స్థలం అంత కూడా కని విని ఎరుగని రీతిలో సాయం వేల ఆహ్లాధ కరమైన స్వచ్ఛమైన వాతావరణం దేదీప్యమానమైన మిలుమిట్లు గోలిపే లైటింగ్, స్క్రీన్ లైవ్ వీడియో తొ పారాయణం జరిగింది, అనంతరం ప్రతీ ఒకరికి తులసి చెట్టు మంగళకర దీపం ఉచితంగా ఇచ్చి అందరిచే గోత్ర నమాలతొ సంకల్పం చేపించి దీపం వెలిగించి అందరికి శుభాలు కలగాలని సిరిసంపదలు కలగాలని మంగళషాషనాలు అందించారు, ఇట్టి పారాయణమునకి ముందు దేవనాధ జీయర్ స్వామి సదస్సును ఉద్దెశించి మాట్లాడుతూ ఒక పశువు బాగుంటే, నీళ్లు, బాగుంటే, గాలి బాగుంటే, ప్రాంతం బాగుంటే, పంచ భూతాలు ఇవన్నీ బాగుంటే స్వీయ ఆరాధన తొ మనుష్యులు బాగుంటే ఒక కుటుంబంలో వైధిక ధర్మం ధర్మాచారణ గా భారతీయ జీవన విధానం అని జీయర్ స్వామి వారి యొక్క అకాంక్ష అని చెప్పారు శ్రీ చిన జీయర్ స్వామి వారు మాట్లాడుతూ విశ్వ శాంతి కోసం లోకానికి చాటడానికి ఇలాంటి జగత్ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో పేరు నమోదు ఆవుద్దని మీరు దూరం నుండి వచ్చిన మీ అందరికి అనేకానేక మంగళషాషనాలు అని స్వామి వారు చెప్పారు, గత 10 రోజుల నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు నమోదు చేసుకున్న వారు, ప్రత్యేక్షముగా వచ్చిన వారు అందరికి స్కాన్ కోడ్ తొ సమతామూర్తి నూట ఎనిమిది దివ్యదేశాల ముందు కుటీరమంతా ఆధ్యాత్మిక వాతావరణములో భక్తులు తన్మయత్వంలో పరవశించారు, భక్తులు, రిజిస్ట్రేషన్ సహాయం కోసం కొంత అవస్థలు పడ్డారని భక్త సంఖ్య ఎక్కువ అవడం 50 చొప్పున విభాగాలుగా ఆచార్య సూచన చేసిన విధంగా క్రమంగా కూర్చొని దైవ పూజల్లో పాల్గొని సమస్త భక్తులకి మంగళశాషనాలు అందించారు చివరగా ప్రసాద వితరనతో కార్యక్రమం మూడవ రోజు పరిపూర్ణ మైనది కార్యక్రమం లో వి టి వాలంటీర్ల సమన్వయముతొ పూర్తి ఐనది..


