బ్రేకింగ్ న్యూస్
దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయందిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయం
వరంగల్

చట్టాల అవగాహనే ఖైదీల పునరావాసానికి తొలి మెట్టు

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ యూసఫ్

నర్సంపేట మహిళా జైలులో ఘనంగా న్యాయ సేవా విజ్ఞాన దినోత్సవం!

మహిళా ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంపై ప్రత్యేక అవగాహన సదస్సు

కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి

మన ప్రగతి న్యూస్/నర్సంపేట,:

దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణం

చట్టాల అవగాహనే ఖైదీల పునరావాసానికి తొలి మెట్టు అని నర్సంపేట కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ యూసఫ్ అన్నారు.నేరాల నుంచి విముక్తి పొంది, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలనే ఉద్దేశంతో నర్సంపేట మహిళా ప్రత్యేక కారాగారంలో జైలు సూపరింటెండెంట్ స్రవంతి అధ్యక్షతన మండల న్యాయ సేవాధికార సంస్థ (ఎంఎల్ఎస్సి) ఆధ్వర్యంలో న్యాయ సేవా విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ యూసఫ్ జైలర్ స్రవంతితో కలిసి మహిళా ఖైదీల సమక్షంలో కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చట్టాలపై అవగాహనే రక్షణ కవచం:

ఈ సందర్భంగా న్యాయమూర్తి మహమ్మద్ యూసఫ్ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరుడికి చట్టాలపై అవగాహన ఉండటం అత్యంత కీలకమని, ఇది ఎవరినైనా రక్షించే కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక లేమి కారణంగా న్యాయం పొందలేని పేదలకు, మహిళలకు చట్టబద్ధమైన సమాన న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.మహిళా ఖైదీలకు రాజ్యాంగం మరియు వివిధ చట్టాలు కల్పించిన ప్రత్యేక హక్కులు, కోర్టుల ద్వారా ఉచిత న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) పొందే పద్ధతుల గురించి న్యాయమూర్తి సమగ్రంగా వివరించారు. ఎవరికైనా న్యాయపరమైన సలహాలు కావాలంటే జిల్లా లేదా మండల న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చని తెలిపారు. ఖైదీలు గతాన్ని విడనాడి, జైలు జీవితాన్ని ఒక ఆత్మపరిశీలన వేదికగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సత్ప్రవర్తనతో మెలగుతూ పునరావాసం దిశగా అడుగులు వేయాలని, సమాజంలో మళ్లీ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ యూసఫ్ ఆకాంక్షించారు. జైలు సూపరింటెండెంట్ స్రవంతి జైలులో ఖైదీల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ రకాల మానసిక కార్యక్రమాల పట్ల వివరించారు. విజిటింగ్ అడ్వకేట్లు పి. సునీత, దివ్య మాట్లాడుతూ.. ఖైదీలకు చట్టపరంగా అందుబాటులో ఉండే బెయిల్ సదుపాయాలు, ఉచిత న్యాయవాది నియామకం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది, ఇతర న్యాయ ప్రతినిధులు మహిళా ఖైదీలు పాల్గొన్నారు.