మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :
తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ నూతన జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వంగాల కళ్యాణిని సోమవారం అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా ఆమోదంతో, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియామకమైన హోంగాల కళ్యాణి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన అందుకు పార్టీ అభివృద్ధి కోసం మహిళా సంక్షేమం కోసం హర్నిశలు కృషి చేస్తానని అన్నారు. నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,జిల్లా పార్టీ అధ్యక్షురాలు లాకావత్ ధన్వంతి, తోపాటు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

