లెంకాలపల్లి గ్రామానికి తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి.
గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన లెంకాల పల్లె బీఆర్ఎస్ శ్రేణులు, వార్డు మెంబర్లు
గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి మృతితో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన.
మనప్రగతిన్యూస్/నల్లబెల్లి:
మండలంలోని లెంకాలపల్లి గ్రామంలో గత మూడు నెలల క్రితం సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి రవీందర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని,సర్పంచ్ చనిపోవడం వలన గ్రామ అభివృద్ధి కుంటూ పడుతుందని గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్తపెళ్లి అశోక్, మాజీ సర్పంచ్ గన్నెబోయిన చేరాలు గౌడ్ సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్లులో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్తూరి విజయలక్ష్మి రవీందర్ సర్పంచిగా ఎన్నికైన అనతి కాలంలోనే గ్రామ అభివృద్ధిలో భాగంగా దాతల సాయంతో వాటర్ ప్లాంట్, వైకుంఠ రథం, కరెంటు కొత్త లైన్లు ట్రాన్స ఫామ్ లతోపాటు బోరుబావులు ఎర్త్ వర్కులు గ్రామస్తులతో సున్నిత సంబంధాలు కొనసాగిస్తూ గ్రామ అభివృద్ధికి ఎంతో సహకారం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి తొమ్మిది నెలలు కూడా పదవి కాలం పూర్తికాకుండానే చనిపోవడం గ్రామస్తులు అందర్నీ కలిసిందని వారన్నారు. ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే జిల్లా కలెక్టర్ డిపిఓ గ్రామపంచాయతీఎన్నికల నిబంధన నియమా వారి ప్రకారం సర్పంచి ఎన్నిక జరిపి ఖాళీగా ఉన్న సర్పంచి పోస్టును భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బోయిన పోషాలు యాదవ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సృజనా రత్నాకర్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ ఆకుల సాంబారావు ప్రస్తుత వార్డు మెంబర్లు గడ్డమీద బాబు గౌడ్, మామిండ్ల పెళ్లి రాణి రాజు, యువజన నాయకులు మేకల వెంకటేష్ ముదిరాజ్, నాన పోయిన కిరణ్ యాదవ్, నాతి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

