బ్రేకింగ్ న్యూస్
ఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యంఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ

అంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీ

అంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీ

ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ కె. రవి

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-

ఆపద సమయంలో ప్రాణాలను కాపాడుతూ 108, 102 అంబులెన్స్ సేవలు ప్రజలకు అపర సంజీవనిలా నిలుస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ కె. రవి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108 అత్యవసర వైద్య సేవలు, 102 అమ్మఒడి అంబులెన్స్ సేవలు అత్యుత్తమంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.శనివారం మండల కేంద్రంలోని 108, 102 అంబులెన్స్ వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్సుల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వైద్య పరికరాల పనితీరు, అత్యవసర మందుల నిల్వలు, వాటి వినియోగంపై క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు అత్యవసర సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంబులెన్సులను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 అంబులెన్స్ సేవల ద్వారా రోడ్డు ప్రమాద బాధితులతో పాటు ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నామని, ఆపదలో ఉన్న వారిని ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నామని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.అదేవిధంగా 102 అమ్మఒడి అంబులెన్స్ సేవల ద్వారా గర్భిణీ స్త్రీలను ప్రసవ పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లడంతో పాటు, పరీక్షల అనంతరం తిరిగి ఇంటి వద్దకు చేర్చుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి, బిడ్డలను సురక్షితంగా ఉచితంగా ఇంటి వద్ద దించుతున్నామని తెలిపారు. అంతేకాకుండా ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు టీకాలు వేయించేందుకు కూడా అమ్మఒడి వాహనాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108, 102 అంబులెన్స్ సేవల ద్వారా ప్రజలకు నిరంతరం వైద్య సహాయం అందిస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కె. రవి కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ దుర్గాప్రసాద్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు యశోద, రామలింగం, పైలెట్లు జానకిరాముడు, ఎం.డి. అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం