మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి:
బీఆర్ఎస్ మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కలిసి ఆత్మీయంగా ఓదార్చారు.మొదట మమత రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోతుకూరి విజయలక్ష్మి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త, మాజీ సొసైటీ చైర్మన్ మోతుకూరి వెంకటేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం గుండె సంబంధిత చికిత్స చేయించుకున్న బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 18వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు బండారు శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన ఆలస్యం రంగయ్యను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనంతరం మోతీనగర్‌లో ఇటీవల మృతి చెందిన చిట్టూరి బాబురావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే వీధిలో ఎల్ఐసీ ఉద్యోగి మంకెన శేషగిరిరావు మాతృమూర్తి చుక్కమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ కార్యక్రమాల్లో గ్రానైట్ సంఘం నాయకులు చిట్టూరి నాగేశ్వరరావు, తాళ్లూరి మధుసూదన్ రావు, రాకేష్ ప్రసాద్, బిళ్లగిరి వెంకటేశ్వరరావుతో పాటు ఖమ్మం కార్పొరేషన్ బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాదరావు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, గొడ్డేటి మాధవరావు, దరిపల్లి శ్రీనివాస్, ఇలియాజ్ పాషా, జమాల్, పరమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

