బ్రేకింగ్ న్యూస్
ఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యంఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ

పేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం

పేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తాం: మంత్రి వాకిటి

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-

పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర క్రీడలు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో కొత్తగా మంజూరైన 548 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆత్మకూరు ప్రాంతాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని, ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా మంజూరు చేయలేదని, కొత్త రేషన్ కార్డులు అందించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేని ఇల్లు ఉండకూడదనే లక్ష్యంతో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో కొత్త పింఛన్ల మంజూరును పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తూ పేదలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడా నిలిపివేయకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు.ఆత్మకూరు ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొంటూ, ఇప్పటికే పట్టణంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. జూరాల వద్ద నిర్మిస్తున్న నూతన వంతెనను త్వరలో ప్రారంభించడంతో పాటు నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేసి రాకపోకలను సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. పరమేశ్వర చెరువు రహదారిని సైతం వెడల్పు చేస్తామని వెల్లడించారు.మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని, విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ జి. నాగమణి, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎం.డి. రహమతుల్లా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం