బ్రేకింగ్ న్యూస్
ఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యంఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ

ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు

ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆ మహా నేతకు ఘనంగా నివాళులర్పించి, నెహ్రూ జయంతి రోజున జరుపుకునే బాలల దినోత్సవం సందర్భంగా బాలలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీరామానంద్ .నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ విద్య, విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి చాచా నెహ్రూ వేసిన పునాదులు భారత ప్రగతికి బాటలు వేశాయని అన్నారు. నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమానత్వం లౌకికవాదం ప్రజాస్వామ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని కోరారు. ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ సృజనాత్మకత నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ విశ్వసించేవారని గుర్తుచేశారు బాలల హక్కులను పరిరక్షిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ భయంలేని బాల్యాన్ని అందించి వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాలని అన్నారు, విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే నెహ్రూ ఆశయాలకు నిజమైన నివాళి అని ఆమె పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల సాంబరెడ్డి, కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, పున్నం నరసింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, బాణాల ప్రసన్న శ్రీనివాస్, శ్రీరామోజు రోజా రాణి, పొన్నాల మనిషా ప్రకాష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల సాంబయ్య గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎర్ర యాకూబ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, గుడిపూడి అరుణ, కుంకిస అరుణ, గద్ద జ్యోతి, తదితరులు పాల్గొన్నారు..