బ్రేకింగ్ న్యూస్
చందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
రాజన్న సిరిసిల్ల

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

_ ప్రణాళిక ప్రకారం ఒక్కో పనికి గడువు విధించి .. ముందుకు వెళ్లాలి

_ పనులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను మరింత పెంచాలి

_ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

_ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష, క్షేత్రస్థాయిలో పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

మన ప్రగతి న్యూస్ / వేములవాడ
రాజన్న సిరిసిల్ల, నవంబర్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆద్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనుల
పై భీమేశ్వర స్వామి ఆలయ గెస్ట్ హౌస్ లో శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారుతో కలిసి .. సమీక్ష సమావేశం నిర్వహించి.. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు.

అనంతరం రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ సీఈ, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారు, స్థపతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో ప్రతి దానికి గడువు విధించి.. పూర్తి చేస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పనులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సమావేశంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, స్థపతులు జయేంద్రన్, గణేష్, స్ట్రక్చర్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ జయంత్ తదితరులు ఉన్నారు.