బ్రేకింగ్ న్యూస్
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కరీంనగర్

చందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయం

చందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి: సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలతో ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు మర్రి మహేశ్‌ ఖాతా నుంచి రూ.57,400 మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహేశ్‌ శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లే సమయంలో తన సెల్‌ఫోన్‌ను ద్విచక్ర వాహనం బ్యాగులో ఉంచాడు. తిరిగి వచ్చి చూడగా ఫోన్‌ డిస్‌ప్లే పనిచేయకపోవడంతో మరమ్మతుల కోసం తీసుకెళ్లాడు. అయినప్పటికీ ఫోన్‌ పనిచేయకపోవడంతో అందులోని సిమ్‌ కార్డులను తొలగించాడు. శనివారం ఉదయం భార్య ఫోన్‌లో సిమ్‌ కార్డులు అమర్చి గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా బ్యాంకు బ్యాలెన్స్‌ పరిశీలించగా రూ.57,400 కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో జరిగిన ఈ ఘటనతో బాధిత రైతు ఆందోళనకు గురయ్యాడు. ప్రజలు అపరిచిత లింకులు, అనుమానాస్పద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ రమేశ్‌ సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ
బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ