బ్రేకింగ్ న్యూస్
రాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్రాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్
తెలంగాణ

సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి

సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి

సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి

సెలవు రోజుల్లోనూ పాఠాలేనా? ప్రైవేట్ స్కూల్‌పై ఆరోపణలు

మన ప్రగతి న్యూస్/ వనపర్తి/ఆత్మకూర్:-

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిలో విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన ప్రైవేట్ పాఠశాలలు చదువు పేరుతో చిన్నారులపై అధిక ఒత్తిడి తీసుకువస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాల్లో సైతం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా సాధారణ పనిదినాల్లో కూడా రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.

చదువుల పేరుతో చిన్నారులపై ఇంతటి భారం ఎందుకు?

విద్యార్థులు ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకునేలోపు ఇప్పటికే ఎన్నో గంటలు చదువులోనే గడుపుతున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం, ఆటపాటల్లో పాల్గొనడం, మానసిక ప్రశాంతత పొందడం కూడా వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. అలాంటిది సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ, పనిదినాల్లో రాత్రి 7.30 గంటల వరకు పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులపై శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు?

ఓవైపు ప్రభుత్వం విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య, బాలల సంక్షేమం గురించి చెబుతుంటే మరోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? లేక పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తు పేరుతో చదువుల భారాన్ని పెంచడం కాకుండా, వారి ఆరోగ్యం, మానసిక వికాసం, విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరులోని సంబంధిత ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేక తరగతుల నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని, సెలవు దినాల్లో తరగతుల నిర్వహణతో పాటు రాత్రి 7.30 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయనే ఆరోపణలపై వాస్తవాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.