బ్రేకింగ్ న్యూస్
ముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణ
రాజన్న సిరిసిల్ల

పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…

పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…

– :అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..

_ ముస్తాబాద్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమం నిర్వహణ, ప్రాథమిక పాఠశాలలో తనిఖీ*

– పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డుల ఆవిష్కరణ

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్:

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని, వారిని ప్రతి రోజూ కేంద్రాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.

ముస్తాబాద్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా అంగన్వాడి కేంద్రంలో పిల్లల ఎత్తు, బరువును పరిశీలిస్తుండగా తనిఖీ చేశారు. సామ్, మామ్ పిల్లలపై ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, పరిశీలించారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డులను ఆవిష్కరించారు.

*ప్రాథమిక పాఠశాలలో తనిఖీ*

అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన యూనిఫాంలు వేసుకున్న విద్యార్థులతో మాట్లాడారు. గణితం, ఇతర అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు, బాలింతలు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో *ప్రతి మంగళవారం 10 నిమిషాలు* కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేంద్రాల సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు తదితర అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు.

ముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రతి రోజూ తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని స్పష్టం చేశారు.

అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. బాలల మొదటి వెయ్యి రోజుల దశ కీలకమని, వారికి సరైన పోషకాహారం ఇంట్లో సైతం ఇవ్వాలని సూచించారు. త్వరలో ఎనిమియా ముక్త్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సర్పంచులు అంగన్వాడీ కేంద్రాల్లో పరిశీలించాలని, సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోషకాహారం అందేలా చూడాలని సూచించారు.

*తల్లులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి*

రక్త హీనతతో ఉన్న మహిళలు ప్రతి ఆరు నెలల ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

*వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రం*

ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు, సరిగా మాట్లాడ లేని పిల్లలు, రక్తహీనత పోషకాహారం లోపం గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు.
ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. అలాగే కరీంనగర్ లో ఎన్ ఆర్ సీ కేంద్రంలో సేవలు అందిస్తారని, ఉన్నత వైద్య సేవలు హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజి రెడ్డి, సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నిర్మల, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీఓ లచ్చాలు తదితరులు పాల్గొన్నారు.