స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి కీలక మలుపు దీక్షా దివస్ కేసీఆర్ త్యాగం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి:
తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి కొత్త ఊపిరి పోసి, రాష్ట్ర సాధన పోరాటాన్ని కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు. కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ, పట్టుదల తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.దీక్షా దివస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.దీక్షా దివస్ను పురస్కరించుకుని నవంబర్ 29న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సాగించిన పోరాట ప్రస్థానాన్ని స్మరించుకుంటూ దీక్షా దివస్ వేడుకలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయని పేర్కొన్నారు.

