బ్రేకింగ్ న్యూస్
కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
తెలంగాణ

ప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యం

ప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యం

ప్రతి కార్యకర్త గెలుపు సైనికుడిగా నిలవాలి!

డాక్టర్.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట /దుగ్గొండి

భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు నేదూరి రాజేందర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై మాట్లాడుతూ..
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక, ప్రజల సమస్యలే మన ఎజెండా
కార్యకర్తలు కేవలం సమావేశాలకే, ఫోటోలకే పరిమితం కాకూడదు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా, ఒక సేవకుడిలా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల కష్టం, సుఖం తెలుసుకుని, వారి గొంతుకై నిలబడాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం

ఎన్నికల్లో గెలుపు ఢిల్లీలో, గల్లీలో నిర్ణయం కాదు. బూత్ లోనే నిర్ణయం అవుతుంది. ప్రతి బూత్ లో కమిటీ పూర్తి స్థాయిలో ఉండాలి. ప్రతి బూత్ లో 20 మంది యాక్టివ్ కార్యకర్తలు ఉండాలి. ప్రతి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు – ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్, ఉజ్వల, జన్ ధన్, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలి.

పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి

పార్టీ పిలుపు ఇస్తే అది ఆదేశంగా భావించాలి. రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇచ్చే ధర్నాలు, ర్యాలీలు, సభలు, సభ్యత్వ నమోదు, ఇంటింటి ప్రచారం వంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త తప్పకుండా పాల్గొనాలి. కార్యక్రమానికి రాని వాడు కార్యకర్త కాదు, కార్యక్రమంలో ముందుండే వాడే నిజమైన బీజేపీ కార్యకర్త.ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను, అవినీతిని, కుటుంబ పాలనను ప్రజల ముందు ఎండగట్టాలి. ప్రజా పక్షాన నిరంతరం పోరాడాలి. బీజేపీ అంటేనే సేవ, బీజేపీ అంటేనే నిబద్ధత అని ప్రజలకు అర్థమయ్యేలా పని చేయాలి.అనంతరం మండల అధ్యక్షులు నేదూరి రాజేందర్, బైరి శ్యాంసుందర్ మాట్లాడుతూ, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దుగ్గొండి మండలంలో పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్ లో బీజేపీ విజయానికి ప్రతి ఒక్కరం సమిష్టిగా, సైనికుల్లా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో.. ఇన్చార్జి బైరి శ్యాంసుందర్, కిసాన్ మోర్చా జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నూతన కంటి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ చెల్పూరి రాజు, మండల ప్రధాన కార్యదర్శి ఖాతర బాజీ చిరంజీవి, మండల పార్టీ ఉపాధ్యక్షులు యాదగిరి నవీన్, సకినాల నరేష్, మండల కార్యదర్శి దూలం రామకృష్ణ, కడివెండి లింగాచారి కొత్తూరి ప్రభాకర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు లడ విశ్వనాథ్, బీజేవైఎం మండల అధ్యక్షులు బుట్టి రాజు, ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి పులిచేరు రమేష్,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కోట కార్తీక్ మాజీ మండల అధ్యక్షులు ఏరుకొండ కర్ణాకర్,బూత్ అధ్యక్షులు బత్తుల నాగరాజు, పొగాకు దేవేందర్, బూర్ల రవి, అంబరగొండ రాజు, వార్డు మెంబర్ మరియు బూత్ అధ్యక్షులు భూసారి నరేష్, ముప్పారపు జగదీష్, అన్న లింగన్న, ఎడ్ల శశిధర్ రెడ్డి, కొట్టూరి రమేష్, వేమునూరు శ్రావణ్, ఈర్ల రాజు, సీనియర్ నాయకులు మాజీ మండల పొన్న రమేష్, తదితరులు పాల్గొన్నారు