మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి:
ఏన్కూరు మండలం ఆరికాయలపాడు గ్రామానికి చెందిన మందడపు అచ్చయ్య కుమారుడు మందడపు సాయిబాబు,శైలజ (లేటు) దంపతుల కుమార్తె మేఘన వివాహం నెల్లూరుకు చెందిన మాడుపూరు వెంకట రామమోహనరావు,లక్ష్మి దంపతుల కుమారుడు దినేష్‌తో ఖమ్మం,బోనకల్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులు మేఘన, దినేష్‌లను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్ రావు, గొడ్డేటి మాధవరావు, చావా ప్రతాప్ బాబు, తన్నీరు రవి, వాకదాని కోటేశ్వరరావు, రేగళ్ల కృష్ణ ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

