బ్రేకింగ్ న్యూస్
బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.
తెలంగాణ

కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి

కలెక్టర్‌కు జేఏసీ నాయకుల వినతి

మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా సైదాపూర్

దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణం

: భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 3న సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో 11 కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని సంయుక్త సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. గతంలో కలెక్టర్ పలుమార్లు ఆదేశించినా కార్మిక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, సైదాపూర్ మండలానికి చెందిన కదిరే రమేష్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయని తెలిపారు. లేబర్ కార్యాలయంలో కార్మికులు, సంఘాల నాయకుల పనులు సకాలంలో జరగడం లేదని, అధికారుల ఏజెంట్ల పనులు మాత్రం వెంటనే పూర్తవుతున్నాయని ఆరోపించారు. ఫిబ్రవరి నుంచి వెల్ఫేర్ బోర్డు పరిధిలో 49 సహజ మరణాలు, ఆరు ప్రమాద మరణాల క్లెయిమ్‌లతో పాటు 300కు పైగా ప్రసూతి, వివాహ సహాయ క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
మూడు ఏఎల్ఓ సర్కిళ్లలో కార్మికుల ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు, లేబర్ అడ్డాల్లో కనీస మౌలిక వసతుల కల్పన, లేబర్ అధికారి నిర్లక్ష్య వైఖరి తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సంయుక్త సమావేశం నిర్వహించాలని కోరారు.
కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఇమ్మడి చక్రపాణి, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల మల్లేశం, ప్రధాన కార్యదర్శి బొంకూరు సత్తన్న, సైదాపూర్ మండల భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు రాధారపు సంపత్, ఇరుకుల్ల బాబు, పులిపాక లక్ష్మణ్, కత్తిరపాక ఎల్లయ్య, కొత్తూరి సురేష్, మైసంపల్లి మల్లేష్, మహంకాళి ప్రవీణ్, కొట్టేపల్లి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.