బ్రేకింగ్ న్యూస్
బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.
తెలంగాణ

రహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం

*_ఆత్మకూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన_*

దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణం

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-రహదారి ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆత్మకూర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వి. జయన్న ప్రజలకు సూచించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆత్మకూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ జయన్న మాట్లాడుతూ.. రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ ప్రాణాల విలువను గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, కార్లు నడిపేవారు భద్రతా పట్టీలు పెట్టుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని హెచ్చరించారు.అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని వివరించారు. వాహనదారులు రహదారి సూచికలను గమనిస్తూ, వేగ నియంత్రణ పాటిస్తూ, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణించాలని సూచించారు.ముఖ్యంగా బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు రహదారిపైకి ఒక్కసారిగా రావద్దని, బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాదచారులు రహదారిని దాటే సమయంలో ఇరువైపులా చూసుకుని జాగ్రత్తగా దాటాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాలకు గురైన తర్వాత బాధపడటం కంటే.. ముందుగానే జాగ్రత్తలు పాటించడం మేలని ఎస్‌ఐ పేర్కొన్నారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమ కుటుంబాలకు భరోసాగా ఉండాలని, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆత్మకూర్ పోలీస్ శాఖ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.