బ్రేకింగ్ న్యూస్
బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుబోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ

ఆత్మకూరులో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల కొరడా… రత్న మెడికల్ స్టోర్ ను సీజ్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మిక

నిబంధనలకు తిలోదాకాలు… రికార్డులు లేకుండానే మెడికల్ షాప్ నిర్వహణ…

20 ఏళ్లుగా అద్దెకు ఫార్మసిస్ట్ ధ్రువ పత్రం ఇచ్చినట్లు వెల్లడి..

oplus_2097154
oplus_0

ఆత్మకూరులో డ్రగ్ కంట్రోల్ అధికారుల కొరడా

నిబంధనలకు పాతర.. రికార్డులు లేకుండానే మెడికల్ స్టోర్ నిర్వహణ

20 ఏళ్లుగా అద్దెకు ఫార్మసిస్ట్ సర్టిఫికెట్.. రత్న మెడికల్ స్టోర్ సీజ్ చేసిన అధికారులు

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:

బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో మెడికల్ షాపుల నిర్వహణపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొరడా ఝళిపించారు. ఎక్స్‌పైరీ మందులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆత్మకూరులోని రత్న మెడికల్ స్టోర్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మరియు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి రష్మిక ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మెడికల్ షాపు నిర్వహణకు సంబంధించిన పలు లోపాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చివరకు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు రత్న మెడికల్ స్టోర్‌ను సీజ్ చేశారు.

రికార్డులు ఏవీ? కొనుగోళ్లకు రసీదులు ఎక్కడ?

అధికారుల తనిఖీల్లో మెడికల్ షాపులో నిర్వహించాల్సిన కీలక రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, కొన్ని మందుల కొనుగోళ్లకు సంబంధించి బిల్లులు, రసీదులు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మందుల కొనుగోళ్లు, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన వివరాలు పారదర్శకంగా ఉండాల్సి ఉండగా, వాటి నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఔషధాల వ్యాపారంలో ఇలాంటి నిర్లక్ష్యం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.20 ఏళ్లుగా అద్దెకు ఫార్మసిస్ట్ సర్టిఫికెట్? ఈ తనిఖీల్లో మరింత చర్చనీయాంశంగా మారిన అంశం ఫార్మసిస్ట్ అనురాధకు సంబంధించినది. తన ఫార్మసీ సర్టిఫికెట్‌ను సుమారు 20 ఏళ్లుగా మెడికల్ షాపు నిర్వహణ కోసం అద్దెకు మాత్రమే ఇచ్చినట్లు వెల్లడైనట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్‌ల నియామకం, వారి ప్రత్యక్ష విధుల నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన ఫార్మసీ సర్టిఫికెట్‌ను తిరిగి ఇవ్వాలని ఫార్మసిస్ట్ అనురాధ డ్రగ్ కంట్రోల్ అధికారులను కోరినట్లు తెలిసింది.

చివరకు రత్న మెడికల్ స్టోర్ సీజ్

నిబంధనల ఉల్లంఘనలు, రికార్డుల నిర్వహణలో లోపాలు, మందుల కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు లేకపోవడం వంటి అంశాలను పరిశీలించిన అధికారులు రత్న మెడికల్ స్టోర్‌ను సీజ్ చేసినట్లు సమాచారం. అయితే ఎక్స్‌పైరీ మందుల విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవాలు ఏమిటి? తనిఖీల్లో ఎలాంటి మందులు గుర్తించారు? సంబంధిత యజమానులపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు

ఔషధాల విక్రయం అనేది సాధారణ వ్యాపారం కాదు.. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో ముడిపడిన అత్యంత బాధ్యతాయుతమైన వ్యవహారం. లాభాలే లక్ష్యంగా పెట్టుకొని నిబంధనలను తుంగలో తొక్కితే ప్రజల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆత్మకూరు పట్టణంలో కేవలం ఒక్క మెడికల్ షాపుకే పరిమితమవకుండా, అన్ని మెడికల్ షాపుల్లోనూ అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టి, ఫార్మసిస్ట్‌ల ప్రత్యక్ష విధుల నిర్వహణ, మందుల గడువు తేదీలు, కొనుగోలు బిల్లులు, నిల్వల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.