మన ప్రగతి న్యూస్ /సిరిసిల్ల జిల్లా స్టాపర్ :
జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలను నిరంతరం పర్యవేక్షించే క్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఈరోజు బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈసందర్భంగా పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ప్రతి కేసులో నిబంధనల ప్రకారం సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, వివిధ రిజిస్టర్లను తనిఖీ చేశారు.ఈసందర్భంగా. ఎస్పీ మాట్లాడుతూ… వివిధ సమస్యలతో స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలపై తక్షణమే స్పందించి చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్ పరిధిలో నేర నియంత్రణే లక్ష్యంగా పెట్రోలింగ్ , రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గంజాయి, డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాల్లో, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, కేవైసీ మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని, ప్రమాదకర డ్రైవింగ్, మైనర్ల వాహన వినియోగం, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఎస్పీ వెంట సిఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.

