బ్రేకింగ్ న్యూస్
19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలి19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలి
తెలంగాణ

19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

_ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు

మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్

పాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవం
పాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవం

సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి 19వ తేదీన సభను విజయవంతం చేయాలి కరీంనగర్ పార్లమెంట్ కో-కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి తెలిపారు , ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు చేపడుతున్న పాదయాత్రలతో ప్రజలకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజల కష్టాలు, రైతుల సమస్యలు గుర్తుకు రాని నాయకులకు ఇప్పుడు పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటుంటే, ఇక్కడ ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రలు చేస్తే ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధి, రాష్ట్రంపై మిగిల్చిన అప్పులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉండాలని హితవు పలికారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న సిద్ధిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ముస్తాబాద్ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ బాల్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరిగిన అప్పులు, ప్రజాధనం వినియోగంపై అనేక ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో జరిగిన నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉందన్నారు. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన నాయకులు ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్నట్లు నటించడం కాకుండా గత పాలనలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చెర్మెన్ ఆరుట్ల మహేష్, డైరెక్టర్ లు ఉపసర్పంచ్, గ్రామ అధ్యక్షులు యాత్ కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.