మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట మున్సిపల్ పరిధిలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, చెప్పులు, వంటి ఇతర సామాన్లు నేడు మున్సిపల్ కార్యాలయంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఆ బాధ్యతను పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రోజు తెల్లవారుజాము నుంచే విధులకు హాజరై వీధులు, రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేస్తూ పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికుల కృషి అభినందనీయమన్నారు. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తున్న కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని, వారికి అవసరమైన రక్షణ పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, గౌరవం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు, పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఎంతో విలువైనదని, వారి కష్టాన్ని గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా , మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేశ్ రెడ్డి , కౌన్సిలర్లు కాంపెల్లి వీణ విజేందర్ రెడ్డి, ముత్తినేని వెంకన్న, బీరం భరత్ రెడ్డి, మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామోజ్ రోజా రాణి, వేల్పుల శ్రీలత, హన్మకొండ శ్రీధర్, దొంగల రజిత, సానిటేషన్ ఇన్స్పెక్టర్ కందిక స్వామి, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

