బ్రేకింగ్ న్యూస్
పాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*పాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*
తెలంగాణ

విద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలు

విద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలు

విద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలు.

విద్యార్థి అమరవీరుల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివి.

శాస్త్రీయ విద్య, సమానత్వ సమాజ స్థాపన కోసం పోరాడుదాం.

పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవి, రాష్ట్ర అధ్యక్షులు మొగిళి వెంకట్ రెడ్డి

మేడ పల్లి గ్రామంలో విద్యార్థుల భారీ ర్యాలీ, కామ్రేడ్ దుస్సా చేరాలు స్మారక సభ.

పాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవం
పాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవం

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

విప్లవ విద్యార్థి ఉద్యమంలో తమ అమూల్యమైన ప్రాణాలు త్యాగం చేసిన విప్లవ విద్యార్థి వీరుల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని, ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యార్థి, జెన్ జీ ఉద్యమాలకు దిక్సూచిల కామ్రేడ్ దుస్సా చేరాలు నిలిచాడని పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవి, పి.డి.ఎస్.యు.రాష్ట్ర అధ్యక్షులు మొగిళి వెంకట్ రెడ్డి లు తెలిపారు.
నల్లబెల్లి మండలం, మేడపల్లి గ్రామంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు.) ఆధ్వర్యంలో నవంబర్ 5 నుండి 11 వరకు విప్లవ విద్యార్థి అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
జీనా హైతో మర్ నా సీఖో-కదం కదం పర్ లడ్ నా సీఖో, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి కోలా శంకర్ , సాంబయ్య , దుస్సా చేరాలు, రంగవల్లి, మారోజు వీరన్న లకు జోహార్లు అంటూ నినదిస్తూ “కామ్రేడ్ దుస్సా చేరాలు స్తూపంపై బిగిపిడికి జెండాను ఎగురవేసి ఘనంగా నివాళులు అర్పించి, “స్మారక సభ” నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా *కొత్తపల్లి రవి, మొగిలి వెంకట్ రెడ్డి* లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య రంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ సామ్రాజ్యవాద శక్తులకు అప్పజెప్పి పూర్తిగా వ్యాపారమయం చేశారని. పేదలకు ఉచితంగా నాణ్యమైన సమాన విద్యను, వైద్యాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరిస్తూ విద్యార్థుల మెదళ్ల లో అంధత్వంతో కూడిన మూఢనమ్మకాలు, కుల, మత విద్వేష విష బీజాలు నాటుతూ
భావి భారత పౌరులను కుల, మతోన్మాదులుగా మార్చే కుట్రలకు పాల్పడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. మోడీ ప్రభుత్వం చేసిన
ఓట్ చోరీతో దేశ ప్రజాస్వామ్యం అపహస్యానికి గురైందన్నారు. మోడీ అనుసరిస్తున్న విధానాలు దేశ లౌకిక వ్యవస్థ మనుగడకు, ప్రజల ప్రజాస్వామిక హక్కులకు, రాజ్యాంగ లక్ష్యాలకు పెను ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో బిజెపి ప్రభుత్వానికి కుల,మత విద్వేషాల పట్ల ఉన్న శ్రద్ధ దేశాభివృద్ధి పట్ల లేదన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, ఫీజు రీయింబర్స్‌మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేటి విద్యార్థులంతా విద్యార్థి అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, శాస్త్రీయ విద్య, సమానత్వ సమాజ స్థాపన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు బోయినపల్లి అజయ్, రవి, కార్యదర్శి అర్జున్, డి. వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు అలవాల నరేష్,పి. అనూష, డివిజన్ నాయకులు వికాస్, బాబర్, రాజు, ఇశాంత్,ఇర్ఫాన్ ,రాకేష్ ,శివకుమార్, విగ్నేష్, సన్నీ, కే.గణేష్, అభిషేక్, కే.హరీష్, వరుణ్ సందేశ్, హరీష్, వంశీ ,చరణ్, అనిల్ కుమార్, నాగ చైతన్య, సురేష్, శ్యామ్ రాకేష్, శ్వేత, సంధ్య, చరణ్, కళ్యాణ్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.