బ్రేకింగ్ న్యూస్
ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మాలెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలిశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మాలెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలిశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..
తెలంగాణ

ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మా

ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మా

ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారుల నిర్లక్ష్యమా..?

ప్రజల ఫిర్యాదులు వినేదెవరు..?

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

లెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి
లెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మండల ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల గైర్హాజరు ప్రశ్నార్థకంగా మారింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల ప్రజావాణి కార్యక్రమానికి పలు కీలక శాఖల అధికారులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విద్యుత్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజావాణికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలనే ఆశతో ప్రజావాణికి వస్తుంటే, సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.ప్రజల సమస్యలను వినాల్సిన కీలక శాఖల అధికారులే కార్యక్రమానికి హాజరుకాకపోతే ప్రజావాణి నిర్వహణ ఉద్దేశం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు వచ్చే ప్రజలకు సంబంధిత అధికారులు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.