బ్రేకింగ్ న్యూస్
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణ

ఎం.వి. రామన్ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఎం.వి. రామన్ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

విద్యార్థుల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అవగాహన.. ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎం.వి. రామన్ హైస్కూల్ (సీబీఎస్ఈ) ప్రాంగణంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా, విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.ఈ వేడుకలకు పాఠశాల చైర్మన్ శ్రీధర్ గౌడ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సుధారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారులు రాంబాబు, స్వరూప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావిభారత నిర్మాతలని, విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సుధారాణి మాట్లాడుతూ మన గతం ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమేనని పేర్కొన్నారు. విద్యార్థులు చదువు విలువను గుర్తించి పట్టుదలతో విద్యనభ్యసించాలని సూచించారు.జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు విద్యార్థుల హక్కులు, బాలల రక్షణకు ఉన్న చట్టాల గురించి వివరించారు. ముఖ్యంగా పోక్సో చట్టంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాలల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాల సోషల్, తెలుగు ఉపాధ్యాయులు బైజు, రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యతోపాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని వివరించారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఉత్సాహం, ప్రతిభతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి
సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి