మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఏన్కూరు మండల కేంద్రంలో కమ్మ మహాజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజనాల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు, సంఘం ప్రతినిధులు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయి, పీఏసీఎస్ చైర్మన్ వడ్డే నారాయణ, ఖమ్మం సిటీ అర్బన్ అధ్యక్షుడు దీపక్ చౌదరి,గుత్త వెంకటేశ్వరరావు మేడ ధర్మారావు, వేముల రమేష్, మాదినేని అశోక్‌కుమార్, తాళ్లూరి అప్పారావు, జాస్తి జనార్ధన్, పొన్నం హరికృష్ణ, మాదినేని లెనిన్,మాదినేని సాయి, కమ్మ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

