బ్రేకింగ్ న్యూస్
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుమాలదార స్వాముల దే ఈ దేవాలయంనవంబర్ 25న వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నావిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుమాలదార స్వాముల దే ఈ దేవాలయంనవంబర్ 25న వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా
తెలంగాణ

గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలి

గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలి

గ్రామపంచాయతీలో ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి.

ఎంపీడీవో ఆఫీసులో సూపర్డెంట్ అభిద్ అలీకి వినతిపత్రం.

బిజెపి మండల అధ్యక్షుడు తడక వినయ్ గౌడ్.

మన ప్రగతిన్యూస్-నల్లబెల్లి:

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?

నల్లబెల్లిగ్రామపంచాయతీలో 2022 సంవత్సరం నుంచి 2026 మార్చి వరకు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఆర్థిక అవకతవకలు, ప్రభుత్వ నిధుల వినియోగం, నగదు నిల్వల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లబెల్లి గ్రామపంచాయతీకి సంబంధించిన రూ.15,21,323 నగదు నిల్వ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ నగదు ప్రస్తుతం ఎక్కడ ఉంది? ప్రభుత్వ ఖాతాలో ఎందుకు జమ కాలేదు? ఈ వ్యవహారానికి బాధ్యులెవరు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు.2022 నుంచి 2026 మార్చి వరకు గ్రామపంచాయతీలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలని, ప్రభుత్వ నిధుల ఖర్చులు, అభివృద్ధి పనుల బిల్లులు, వోచర్లు, కొనుగోళ్లు, క్యాష్‌బుక్, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఆడిట్ నివేదికలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు. అవసరమైతే ప్రత్యేక ఆడిట్ నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.గతంలో కూడా కొన్ని ఆర్థిక అంశాలు అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సంబంధిత రికార్డులను భద్రపరిచి, వాటిలో ఎలాంటి మార్పులు లేదా తారుమారులు జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజాధనం దుర్వినియోగం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. గ్రామపంచాయతీకి వచ్చే ప్రతి రూపాయి ప్రజల సొమ్ము. ఆ సొమ్ముకు అధికారులు లెక్క చెప్పాల్సిందే. ఎవరి హోదా, పలుకుబడి అడ్డుపెట్టుకున్నా ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారాల్లో పారదర్శకత తప్పనిసరి. అవకతవకలు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నిధులను రికవరీ చేయాలి అని తడుక వినయ్ గౌడ్ స్పష్టం చేశారు.ఈ ఫిర్యాదు ఎవరి మీద వ్యక్తిగత కక్షతో చేస్తున్నది కాదని, గ్రామపంచాయతీ పాలనలో పారదర్శకత ఉండాలని, ప్రజాధనానికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతోనే బీజేపీ మండల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిందనితెలిపారు.అధికారులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణమే విచారణ చేపట్టాలని, విచారణలో జాప్యం జరిగితే జిల్లా స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామని తడుక వినయ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెరుమాండ్ల కోటి, సుదగాని ప్రమోద్ కుమార్, కొండి రమేష్, నాగేల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.