బ్రేకింగ్ న్యూస్
కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
తెలంగాణ

కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం

కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం

డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి

తెలంగాణకు రూ.50 వేల కోట్ల తక్షణ కరువు సహాయం అందించాలి

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

ప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోవడం, రాజకీయ ప్రయోజనాలను పొందడం కోసమే అశాస్త్రీయంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, ఇదే పద్ధతిలో డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు.గిర్నిబావిలోని జి.ఆర్.బి. గార్డెన్స్‌లో కామ్రేడ్ కుసుంబ బాబురావు అధ్యక్షతన ఎంసిపిఐ(యు) రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనువాద భావజాలాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తన అధికారాన్ని కాపాడుకుంటూ మరోసారి అధికారంలోకి రావాలనే రాజకీయ లక్ష్యంతో నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకుంటోందని అన్నారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి, వాటిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి అమలును వాయిదా వేయడం ద్వారా మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజలను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణకు రూ.50 వేల కోట్ల కరువు సహాయ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తగిన నిధులు విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు మోర్తాల చందర్రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఎన్.రెడ్డి, హంసారెడ్డి, సింగతీ సాంబయ్య, మాడిశెట్టి అరుణ్‌కుమార్, మంద రవి, పానుగంటి నరసయ్య, తాటికొండ రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ, తాండ్ర కళావతి, సింగతి మల్లికార్జున్, నాగేల్లి కొమురయ్య, నీల రవీందర్, మాస్ సావిత్రి, కనకం సంధ్య, పల్లె మురళి, గడ్డం నాగార్జున, గుండెబోయిన చంద్రయ్య, కంచ వెంకన్న, జబ్బర్ నాయక్, శ్రీనివాస్, మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి, మాలోతు రాజేష్, భాషిపాక రమేష్, బల్సుకురి నర్సయ్య, పెద్ది సూరి, మధు తదితరులతో పాటు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పాల్గొన్నారు.