సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్రచారి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్28: మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకొని, శారీరకంగా కలిసిన కేసులో పోతుగల్ గ్రామానికి చెందిన దానవేని సమ్మయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. సమ్మయ్య జనగామకు వెళ్లిన సమయంలో ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పోతుగల్‌కు తీసుకొచ్చాడు. అనంతరం తన తల్లిదండ్రులు దానవేని కేశవులు, కనుకవ్వ సమక్షంలో బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం కేసు ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ కాగా, విచారణ చేపట్టిన కేసు అధికారి, సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్రచారి శనివారం నిందితుడు సమ్మయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

