కాప్రా: గణేష్ ఉత్సవ సమితి ఆత్మగౌరవ బ్యానర్ తొలగింపు అంశంపై న్యాయం కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు సమితి కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై సెప్టెంబర్ 22న కమిషన్కు ఫిర్యాదు అందజేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు పురోగతిని తెలుసుకునేందుకు మంగళవారం మరోసారి ఎస్సీ కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత అధికారులను కలిశారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు వారం రోజుల్లోగా ఫిర్యాదుపై కమిషన్ స్పందించే అవకాశం ఉందని తెలిపినట్లు గగన్ కుమార్ వెల్లడించారు. గణేష్ ఉత్సవ సమితి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశంలో న్యాయం జరిగే వరకు చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు

