ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.
నల్లబెల్లి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లబెల్లి శాఖలో బ్యాంకు అధికారులు, సిబ్బంది మరియు ఖాతాదారుల సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ టి. నాగేష్, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ టి. వెంకటేశ్వర్లు, క్యాషియర్ కె. రామకృష్ణ, సబ్‌స్టాఫ్ రమేష్, గోల్డ్ అప్రైజర్ బి. రాజు, బిజినెస్ కరస్పాండెంట్లు కోమల, గణేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పలువురు ఖాతాదారులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ, 108 సంవత్సరాలుగా దేశ ప్రజలకు విశిష్టమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రజల నమ్మకమే పునాది… నాణ్యమైన సేవలే లక్ష్యం… ప్రజల అభివృద్ధే మా ఆశయం అని అన్నారు.

